కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నుండి సినిమా వచ్చి దాదాపు ఏడాది దాటిపోతుంది. గతేదిలో కార్తీ నటించిన "సుల్తాన్" విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. లేటెస్ట్ గా కార్తీ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్", "సర్దార్", "విరుమాన్" అనే సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కార్తీ చేతిలో ఉన్న సినిమాలన్నీ షూటింగ్ ముగించుకున్నాయట. ఈ సినిమాలలో గుబురు గడ్డం, బారు మీసాలతో కనిపించనున్న కార్తీ, అందుకోసం నిన్నటివరకు ఆ గెటప్ లోనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఆ సినిమాల షూటింగులు పూర్తి కావడంతో, దాదాపు ఆరేళ్ళ తర్వాత షేవ్ చేయించుకున్నాడట. తన కొత్త పిక్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇందులో ట్రిమ్డ్ గడ్డం, స్టైలిష్ హెయిర్.. ట్రెండీ లుక్ లో కార్తీ సూపర్ గా ఉన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ ఫుల్ వైరల్ అవుతుంది.