సుకుమార్ తెరకెక్కించిన "పుష్ప" పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో పుష్ప గా బన్నీ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచాడు. శ్రీవల్లిగా రష్మిక ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ప్రయత్నాల్లో భాగంగా డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ ను ఎలాంటి లూప్ హొల్స్ లేకుండా చాలా పకడ్బందీగా, ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ను లాక్ చెయ్యబోతున్నాడని తెలుస్తుంది. ఈ మేరకు మైత్రి ఆఫీస్ లో సుకుమార్ తన రచయితల బృందంతో పుష్ప చర్చలు జరుపుతున్నారు. ఈ డిస్కషన్స్ లో సుకుమార్ శిష్యుడు, "ఉప్పెన" డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.