స్టార్ హీరోల భారీ రెమ్యునరేషన్ పై పలు ఇబ్బందులను వ్యక్తం చేసిన టాలీవుడ్ నిర్మాతలు ఆగస్టు ఒకటవ తేదీ నుండి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కదా. అంటే ఆగస్టు 1 నుండి టాలీవుడ్ లో ఏ సినిమా షూటింగ్ జరగదన్న మాట. నిజానికి ఈ సమ్మె చాలామందికి ముఖ్యంగా సినీ కార్మికులకు, పలు చిత్రాలకు నష్టం మిగులుస్తుండగా, నందమూరి నటసింహం బాలకృష్ణకు మాత్రం లాభాన్నిస్తుందని అంటున్నారు.
ఇంతకీ విషయమేంటంటే, ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటిస్తున్న సినిమా షూటింగ్ కర్నూల్ లో జరుగుతుంది. ముందుగా ఈ సినిమాను దసరా బరిలో దింపుదామనుకున్న నిర్మాతలు, షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో డిసెంబర్ కి వాయిదా వేసారట. ఇప్పుడు నిర్మాతల సమ్మె మొదలవ్వబోతుండడంతో, ఈ సమ్మె ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు కాబట్టి, NBK 107 షూటింగ్ కి లాంగ్ బ్రేక్ పడినట్టే. దీంతో డిసెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతుందని అంతా అనుకుంటున్నారు. సంక్రాంతి బాలయ్యకు బాగా అచ్చొచ్చిన సీజన్ కాబట్టి, గతంలో సంక్రాంతి కి విడుదలైన బాలయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి కాబట్టి, ఇదే సెంటిమెంట్ NBK 107కు కూడా వర్తిస్తుందని బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి, బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ NBK 107కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.