మాస్ రాజా రవితేజ ఇంకా రెండ్రోజుల్లోనే "రామారావు ఆన్ డ్యూటీ" తో ప్రేక్షకులను పలకరించనున్నారు. న్యూ డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పొతే, ఈ మూవీపై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, రామారావు ఆన్ డ్యూటీ స్క్రిప్ట్ ను రవితేజ పూర్తిగా మార్చివేశారట. ముందుగా శరత్ రవితేజకు వినిపించిన స్క్రిప్ట్ అచ్చు మహేష్ "భరత్ అనే నేను" సినిమాలా చాలా క్లాస్సిగా ఉంటుందట. అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ తనకంతగా సూట్ కాదు కాబట్టి ఫుల్ మాస్ ఎలిమెంట్స్, ఐటెం సాంగ్ చేర్చమని శరత్ చేత స్క్రిప్ట్ ను చాలావరకు తిరిగి రాయించాడట. ఇప్పుడు విషయమేంటంటే, రవితేజ తన గత చిత్రం "ఖిలాడీ" సినిమాకు కూడా ఇలానే స్క్రిప్ట్ విషయంలో అతిచొరవ చూపించి, మార్పులు చేర్పులు చేసి ఒక డిజాస్టర్ ఔట్ పుట్ ను తీసుకొచ్చారు. మరి, ఇప్పుడు రామారావు స్క్రిప్ట్ ను కూడా రవితేజ డిస్టర్బ్ చేసాడని ప్రచారం జరుగుతుంది కాబట్టి, ఈ సినిమా ఫలితంపై అంతటా ఆసక్తి నెలకొంది.