మెగా డాటర్ నిహారిక 2020లో వెంకట చైతన్య అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఆపై పూర్తిగా సినిమాలకు దూరమైన నిహారిక పింక్ ఎలిఫాంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, వెబ్ సిరీస్లను నిర్మిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఎలాగైతే, శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ట్యాగ్ తో సినిమాలకు ఎంట్రీ ఇచ్చాడో అలాగే, మీరు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అని నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిహారిక భర్త చైతన్యను యాంకర్ అడుగుతారు. అందుకు చైతన్య చాలా సింపుల్ గా ఆన్సరిచ్చారు. సినీ రంగ ప్రవేశం చెయ్యాలన్న ఆలోచన తనకు లేదని, బిజినెస్ రంగంలో ఉన్న తనకు ఆ రంగం చాలా కంఫర్ట్ గా ఉందని చెప్పారు. అంటే, ఇప్పుడప్పుడే చైతన్య టాలీవుడ్ ఎంట్రీ ఉండదన్న మాట. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా!