ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన మల్టీ లింగువల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం "గార్గి". విరాటపర్వం తో కెరీర్లో తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసిన సాయి పల్లవి ఆ వెంటనే మరొక ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.
గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాక కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. ఈ సినిమాను తమిళంలో హీరో సూర్య, జ్యోతిక, తెలుగులో హీరో రాణా సమర్పించడం విశేషం. ఈ సినిమాలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, శివాజీ, శరవణన్, జయప్రకాశ్ తదితరులు నటించారు.
లేటెస్ట్ గా గార్గి డిజిటల్ ఎంట్రీకి ముహూర్తం ఖారారైనట్టు తెలుస్తుంది. ఆల్రెడీ గార్గి డిజిటల్ హక్కులను ప్రఖ్యాత సోనీ లివ్ ఓటిటి సొంతం చేసుకుంది కాబట్టి, ఆ ఓటిటిలోనే ఆగస్టు నెల రెండవ వారం నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుందని లేటెస్ట్ టాక్.