‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తోన్న ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాలో కత్రినా కైఫ్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై బీటౌన్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో కత్రినా కైఫ్, జాకీష్రాఫ్ నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa