టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న సినిమా "వారసుడు". తెలుగు, తమిళంలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఇంకా షూటింగ్ పూర్తి కానీ ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది. పోతే, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa