కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన కొత్త చిత్రం "విక్రాంత్ రోణ" ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదలై, ప్రతి చోటా విశేష ఆదరణ దక్కించుకుంటుంది. అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలు పోషించారు.
లేటెస్ట్ గా ఈ సినిమాను చూసిన రాజమౌళి సినిమాను, కిచ్చా సుదీప్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు. "విక్రాంత్ రోణ గ్రాండ్ సక్సెస్ కు శుభాకాంక్షలు. ఇలాంటి కాన్సెప్ట్ పై ఇన్వెస్ట్ చెయ్యటానికి చాలా గట్స్ ఉండాలి, అపారమైన నమ్మకం ఉండాలి. అది మీరు చేశారు... ఫలితంగా గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నారు. ప్రీ క్లైమాక్స్ సినిమాకు హార్ట్ లాంటిది. ఎవరూ ఊహించని ఆ సంఘటన చాలా బాగుంది. ".. అని రాజమౌళి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.