"బీస్ట్" సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తదుపరి "వారసుడు (వారిసు)" చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరగబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు చెన్నై నుండి వైజాగ్ బయలుదేరబోతున్న విజయ్ ఎయిర్పోర్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.