నందమూరి అభిమానులు "అన్న- వదిన" అని ఎంతో అభిమానంగా పిలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మి ప్రణతిల క్యాండిడ్ పిక్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన ఈ కపుల్ అక్కడి ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ ప్లేస్ లో, హాయిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ పిక్ ను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. "ఇలాంటి క్షణాలు ప్రేమమయం".. అని అర్ధం వచ్చేలా కామెంట్ చేసి, ఈ పిక్ ను షేర్ చేసారు. కొద్ది నిముషాల్లోనే ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
RRR తరవాత పూర్తిగా మీడియాకు దూరమైన తారక్ రీసెంట్గానే, బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అఫీషియల్ పబ్లిక్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల మూవీ కోసం తారక్ సన్నద్ధమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa