ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 107: అంచనాలను పెంచేస్తున్న బాలయ్య న్యూ లుక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 04:40 PM

గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే కదా. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, NBK 107 షూటింగ్ ప్రస్తుతం కర్నూల్ లో జరుగుతుంది. అక్కడి ఫేమస్ ప్లేసెస్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ చూడడానికి బాలయ్య అభిమానులు ఎంతో మంది లొకేషన్ పరిసరాల్లో సందడి చేస్తున్నారు. వీరికి అభివాదం తెలుపుతున్న బాలయ్య పిక్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఈ పిక్ లో వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో, మెళ్ళో కండువాతో, కళ్ళకు బ్లాక్ కలర్ గాగుల్స్ తో బాలయ్య మాస్ కా బాప్ తరహాలో దర్శనమిస్తున్నారు. డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa