టాలీవుడ్, కోలీవుడ్లలో మంచి గుర్తింపు సంపాదించిన హీరోయిన్ ప్రణీత ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో సెలెబ్రటీలు తమ పిల్లల ముఖాల్ని చూపించకుండా, అభిమానుల్ని ఊరిస్తుంటే, ప్రణీత మాత్రం తన బేబీ గర్ల్ ఫేస్ ను రివీల్ చేసి అందరిని షాక్ చేసింది. "ఇంట్రడ్యూసింగ్ ఆర్ణ... " అంటూ కూతురిని అందరికి పరిచయం చేసింది. నిద్రపోతున్న ఆ బేబీ ఫోటో చాలా క్యూట్ గా ఉంది. దీంతో ప్రణీతకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ, బేబీ చాలా క్యూట్ గా ఉందంటూమెసేజ్ లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa