టాలీవుడ్ యంగ్ హీరో, "మా" ప్రెసిడెంట్ మంచు విష్ణు "జిన్నా" అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదలవబోతుంది. మురుగదాస్, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఇషాన్ సూర్య ఈ సినిమాకు డైరక్టర్ గా పని చేస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చూచాయగా తెలుపుతూ విష్ణు ట్వీట్ చేసారు. ఐతే ఇంకా ఈ డేట్ పై కన్ఫర్మేషన్ రాలేదులేండి. విష్ణు ట్వీట్ ప్రకారం, జిన్నా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఒకవేళ ఈ తేదీనే ఫిక్స్ ఐతే, మంచు విష్ణు కింగ్ నాగార్జున తో డైరెక్ట్ పోటీకి దిగినట్టే, ఎందుకంటే, అదేరోజు నాగార్జున నటించిన "ఘోస్ట్" కూడా విడుదల కాబోతుంది. చూద్దాం.. విష్ణు మనసు మార్చుకుంటాడో లేక అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంటాడో..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa