ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"టైగర్ నాగేశ్వరరావు" లో బాలీవుడ్ విలక్షణ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 10:02 AM

వంశీ డైరెక్షన్లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం "టైగర్ నాగేశ్వరరావు". ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 1970లలో దేశవ్యాప్తంగా పేరుమోసిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందనుంది. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఒక కీలక ప్రకటన చేసారు. ఈ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేసారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com