"సీతారామం" నుండి ఇప్పటివరకు విడుదలైన లిరికల్ పాటలు ప్రేక్షకులకు వింటేజ్ డేస్ ను గుర్తుకు తెస్తూ, వారి ప్లే లిస్ట్స్ లో రిపీటెడ్ గా ప్లే అవుతున్నాయి. లేటెస్ట్ గా సీతారామం నుండి మరొక లిరికల్ సాంగ్ "ఓహ్ ప్రేమా " అనే గీతాన్ని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
హను రాఘవపూడి డైరెక్షన్లో హృద్యమైన ప్రేమ కావ్యంగా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా, రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తుంది. పొతే, ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఆగస్టు 5న విడుదల కాబోతుంది.