సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా గడ్డం, మీసాలు లేకుండానే సినిమాల్లో నటిస్తారు. పోకిరి నుండి ట్రిమ్డ్ గడ్డం, మీసాలతో లుక్ ను రగ్డ్ గా మార్చుకున్నారు. ఇక అప్పటి నుండి అదే మైంటైన్ చేస్తున్న సూపర్ స్టార్ లేటెస్ట్ గా ఫుల్ గడ్డం, మీసాలతో కనిపిస్తున్నారు.
ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సూపర్ స్టార్ యొక్క న్యూ లుక్ ను ఆయన భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన "మహర్షి" లో కూడా మహేష్ కొంతసేపు ఫుల్ గడ్డం, మీసాలతో కనిపిస్తాడు. మరి ఇప్పుడు తాజాగా మహేష్ ఇలాంటి లుక్ లో కనిపిస్తున్నాడంటే, త్రివిక్రమ్ సినిమా కోసమేనని అంతా అనుకుంటున్నారు. ఏమైనా... మిల్కీ బాయ్ ఈ న్యూ లుక్ లో కూడా చాలా బాగున్నారని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.