శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన "థాంక్యూ" ఇటీవల థియేటర్లలో విడుదలై ఎంతటి డిజాస్టర్ కలెక్షన్లను రాబడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైతు హిట్ ట్రాక్ కు సడెన్ బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. అలానే దిల్ రాజు కు కూడా గట్టి షాక్ ఇచ్చింది. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు.
జూలై 22న విడుదలైన ఈ సినిమా తొలి వీకెండ్ కే క్లిజింగ్ కొచ్చేసింది. దీంతో మూడు వారాల గ్యాప్ లోనే థాంక్యూ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. అంటే, ఆగస్టు 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో థాంక్యూ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.