సీతారామం మేకర్స్ ఈ రోజు స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. రేపు రాత్రి ఏడింటి నుండి సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, బిగ్ సర్ప్రైజ్ ఆడియన్స్ కోసం తీసుకురాబోతున్నామని చెప్పారు. లేటెస్ట్ గా ఈ బిగ్ సర్ప్రైజ్ ప్రభాస్ అని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారన్న మాట. ఐతే, ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ ప్రభాసే ఆ స్పెషల్ సర్ప్రైజ్ అని ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ, సీతారామం ను సమర్పిస్తున్న అశ్వినీదత్ గారు ప్రభాస్ సీతారామం ఈవెంట్ కు రావట్లేదని, సర్జరీ నిమిత్తం విదేశాలకు వెళ్లారని చెప్పారు. ప్రస్తుతానికైతే, సీతారామం చీఫ్ గెస్ట్ పై బిగ్ కన్ఫ్యూషన్ నెలకొంది. క్లారిటీ రావాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే.