సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు కొన్ని రోజుల క్రితం హాట్ హాట్ వార్తలు మీడియాలో హల్చల్ చేసాయి. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ నిమిత్తం హిందీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతన్య ఈ విషయంపై తొలిసారి స్పందించారు. ఫస్ట్ ఇలాంటి వార్తలను విన్నప్పుడు బాధనిపించిందని, కానీ, ఇప్పుడు తనొక డిఫరెంట్ అండ్ బెటర్ పొజిషన్ లో ఉన్నానని, ఈ రోజు సంచలనం సృష్టించిన వార్తను రేపు మరొక వార్త వచ్చి రీప్లేస్ చేస్తుందని, ఇలాంటి రూమర్లను తాను ఖాతరు చెయ్యనని, తన ప్రొఫెషన్ వర్క్ మీదనే పూర్తి ధ్యాస ఉందని చెప్పారు.
అద్వైత్ చందన్ డైరెక్షన్లో,ఆమీర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్, నాగచైతన్య నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.