చందూ మొండేటి డైరెక్షన్లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మొదట్లోనే విడుదల కావలసి ఉంది. కానీ, పలు కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 12న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
సినిమా వాయిదా పడుతుండడంతో నిఖిల్ తన అసహనాన్ని మీడియా సుముఖంగా వ్యక్తపరిచి, అందరిని ఆశ్చర్యపరిచారు. ఒక సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసి, అదే మైంటైన్ చెయ్యడం చాలా కష్టమని, డిస్ట్రిబ్యూషన్ లో ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల తన సినిమా ఆలస్యమైందని వాపోయాడు. దీంతో మా ప్రెసిడెంట్, యాక్టర్ విష్ణు తన మద్దతును నిఖిల్ కు ప్రకటిస్తూ, ట్వీట్ చేసారు. "నిఖిల్... ధైర్యంగా ఉండండి.. నేనున్నాను... ఆఖరికి కంటెంట్ ఉన్న సినిమాలే విజయం సాధిస్తాయి " అని ట్వీట్ చేసారు. ఈ సందర్భముగా కార్తికేయ 2 విడుదల కోసం తాను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.