లోకేష్ కానగరాజ్... ఇటీవలే "విక్రమ్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్. ఆయన కెరీర్లో చేసింది నాలుగే నాలుగు సినిమాలు. తొలిసినిమా మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ ... అవన్నీ కూడా హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్. ఒక్క ఫ్లాప్ కూడా లేని సక్సెసఫుల్ డైరెక్టర్ కొన్నాళ్ళు అన్ని రకాల సోషల్ మీడియా ఖాతాలకు దూరమవుతున్నట్టు తెలుపుతూ ట్వీట్ చేసారు. కొన్ని రోజుల తరవాత కొత్త సినిమా ఎనౌన్స్మెంట్ తో మళ్ళీ పలకరిస్తానని చెప్పి ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి లోకేష్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఆల్రెడీ గతంలో వీరి కాంబోలో వచ్చిన "మాస్టర్" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలున్నాయి.