అక్కినేని నాగచైతన్య నటించిన "థాంక్యూ" భారీ అంచనాలు నడుమ విడుదలై ఎంతటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. BVS రవి అందించిన కథను విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఆచార్య"కు కూడా BVS రవి పని చేసారు. అది చిరు కెరీర్లో, 2022 లో వచ్చిన చిత్రాలలన్నిటిలో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడిదే సెంటిమెంట్ మెగా ఫ్యాన్స్ ను భయపెడుతుంది. BVS రవి డైరెక్ట్ చేసిన సినిమాలు వాంటెడ్, జవాన్ కూడా డిజాస్టర్లుగానే మిగిలాయి.
మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు కూడా BVS రవి పని చేస్తుండడంతో మెగా అభిమానులు ఆ చిత్ర విజయాల పట్ల టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.