అక్కినేని నాగ చైతన్య తన హిందీ డిబట్ మూవీ "లాల్ సింగ్ చద్దా" ప్రమోషన్స్ నిమిత్తం ఉత్తరాది మీడియాకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా కాఫీ విత్ కరణ్ షోలో అవకాశం వస్తే పాల్గొంటారా? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు చైతు చాలా సింపుల్ గా ఆన్సరిచ్చారు. తనకు కరణ్ వర్క్ అంటే చాలా ఇష్టమని, అవకాశం వస్తే ఖచ్చితంగా ఆషోలో పాల్గొంటానని, కరణ్ నన్ను రమ్మని అడిగితే వెళ్తానని చెప్పారు.
కాఫీ విత్ కరణ్ సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకు సౌత్ నుండి సమంత, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న విడుదల కాబోతుండడంతో ఆ మూవీ టీం తరపున చైతు కూడా ఈ షోలో పాల్గొంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఈ షోలో కేవలం ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ మాత్రమే పాల్గొన్నారు.