మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా, తమిళ బాహుబలిగా పేర్కొంటున్న "పొన్నియిన్ సెల్వన్" పై టాలీవుడ్ జక్కన్న షాకింగ్ కామెంట్స్ చేసారు. 1950 కాలంలో రచయిత కల్కి రచించిన హిస్టారికల్ నోవెల్ "పొన్నియిన్ సెల్వన్". ఈ నవల ఆధారంగానే పొన్నియిన్ సెల్వన్ మూవీ చిత్రీకరింప బడింది. మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించి, మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాజమౌళి పొన్నియిన్ సెల్వన్ నవలను సినిమాగా తీసేంత క్యాపబిలిటీ తనకు లేదని, కంటెంట్ ఎక్కవుగా ఉంటుంది కాబట్టి వెబ్ సిరీస్ గా తీస్తే చాలా బాగుంటుందని, RRR కన్నా ముందే ఓటిటి డిబట్ చేసేవాడినని చెప్పారు. రస్సో బ్రదర్స్ తో నెట్ ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఇంటిరాక్షన్ సెషన్ లో జక్కన్న ఈ వ్యాఖ్యలు చేసారు.