గమనం, చూసీ చూడంగానే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సారగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్, విజయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి లేటెస్ట్ గా మేకర్స్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసారు. టైటిల్ డిజైన్, శివ లుక్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఈ గ్లిమ్స్ కూడా ఎంతో ఆసక్తిగా సాగాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేసారు.