రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన "RRR" చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాలెంట్ ఎల్లలు దాటింది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరు విశేషాసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, రెండు భారీ బడ్జెట్ సినిమాల ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31... ఈ రెండు చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాయి. ఐతే, 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా తో కూడా యంగ్ టైగర్ ఒక సినిమాను చెయ్యాల్సిందని, అందుకు సంబంధించిన ప్రకటన కూడా రావాల్సిందని ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు, తారక్ ల మధ్య ఒక పాయింట్ వద్ద సఖ్యత కుదరకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంతా అనుకున్నారు.
కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బుచ్చిబాబుతో తారక్ సినిమా ఖచ్చితమని, కొరటాల సినిమాతో పాటు సైమల్టేనియస్ గా ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. మరి, ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.