టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక బ్యాలన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.
"హరిహరవీరమల్లు" తో పవన్ కూడా బాలీవుడ్ ను పలకరించబోతున్నాడు. కానీ సూపర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ పైనే ఇప్పటివరకు క్లారిటీ లేదు. అదీకాక గతంలో మహేష్ బాలీవుడ్ సినిమాలు చెయ్యనని, తనకు టాలీవుడ్ లో పని చెయ్యడమే కంఫర్ట్ గా ఉంటుందని చెప్పడంతో, సూపర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఉండదని అంతా అనుకున్నారు.
లేటెస్ట్ గా మహేష్ బాబు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటించబోయే చిత్రంతో బాబుగారి బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ప్రభాస్, చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదుపరి జక్కన్న చేతుల మీదుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మహేష్. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. 2023 లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవనుంది.