2014లో విడుదలైన 'కార్తికేయ 2' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ చందు మొండేటి. ఆపై ప్రేమమ్, సవ్యసాచి, బ్లడీ మేరీ (ఓటిటి రిలీజ్) చిత్రాలను డైరెక్ట్ చేసిన చందూ లేటెస్ట్ గా కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆగస్టు 12న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈటివి ఛానెల్ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే టాక్ షోకు హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి హాజరయ్యారు. ఈ షోలో చందు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సూపర్ అప్డేట్ ఇచ్చారు.
తనకు కింగ్ నాగార్జున అంటే చాలా ఇష్టమని, కార్తికేయ 2 విడుదలై అన్ని అనుకున్నట్టు జరిగి సూపర్ హిట్టయితే, తదుపరి నాగార్జున గారితో సినిమా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు నాగార్జునతో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ స్టోరీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పారు.