యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అలరిస్తున్నాడు. బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు, స్కై ల్యాబ్ వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలనే మెగాస్టార్ ఆచార్య చిత్రంలో తళుక్కున మెరిశాడు. మెగాస్టార్ మరో చిత్రం గాడ్ ఫాదర్ లో కూడా సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఇటీవలే "గాడ్సే" అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సత్యదేవ్ "కృష్ణమ్మ" అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసి, ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా యొక్క టీజర్ ను ఆగస్టు 4వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ సమర్పిస్తున్న ఈ సినిమాకు వీవీ గోపాల కృష్ణ డైరెక్టర్. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.