ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కైలో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 28, 2018, 12:19 PM

అందాల తాప్సీ కెరీర్ నెవ్వర్ బిఫోర్ అన్న చందంగా సాగుతోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో కనిపించపోయినా బాలీవుడ్ లో తనదైన హవా సాగిస్తోంది. `జుడ్వా 2` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వతా బాలీవుడ్ లో కెరీర్ పరంగా వెనుతిరిగి చూసిందే లేదు. ముంబైలో ఈ దిల్లీ భామ బిజీ నాయికగా రాజ్యమేలుతోంది. ఇటీవలే ముల్క్ - మన్మార్జియాన్ చిత్రాలతో విజయాలు అందుకోవడం తనకు రకరకాలుగా కలిసొస్తోంది. వరుస సక్సెస్ ల నేపథ్యంలో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ పదింతలు పెరిగిందన్న మాటా వినిపిస్తోంది.


ఇటీవలే పలు కార్పొరెట్ బ్రాండ్లకు తాప్సీ సంతకాలు చేసింది. గురువారం ఓ వస్త్ర దుకాణం  ప్రచారం కోసం హైదరాబాద్ నగరానికి విచ్చేసిన తాప్సీ రెడ్ కార్పెట్ నడకలతో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలో లోకల్ మీడియాలో తాప్సీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వరుస విజయాలతో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఒక్కో బ్రాండ్ కి కోట్లలో కాంట్రాక్ట్ కుదుర్చుకుందన్న ప్రచారం సాగుతోంది. ముల్క్ - మన్మార్జియాన్ చిత్రాలతో సక్సెస్ మాత్రమే కాదు నటిగానూ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఆ క్రమంలోనే యువతరం తాప్సీని అమితంగా ఇష్టపడుతున్నారు. తనని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అందుకే తనతో బ్రాండింగ్ చేయించేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయిట.


 


ఈ స్పీడ్ లోనే ముంబైలో స్టార్ హీరోయిన్ల ఖాతాలో ఉన్న బ్రాండ్లకు ఎసరు పెడుతోంది తాప్సీ పన్ను. ఇదివరకూ కత్రిన - కంగన బ్రాండ్స్ ను టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్ రారాజు లైఫ్ స్టైల్ కి తనే అంబాసిడర్... ఆ క్రమంలోనే హైదరాబాద్ కు పబ్లిసిటీ కోసం విచ్చేసింది. తాప్సీ కిచెన్స్ పేరుతో కిచెన్ సామాగ్రి - వస్త్ర దుకాణాలు - ఫ్యాషన్ & ట్రెండ్స్ వగైరా వగైరా బ్రాండ్లకు తాప్సీనే ఓ ఆప్షన్ గా మారింది. అయితే తనవైపు వస్తున్నంత మాత్రాన ప్రతిదానికి సంతకం చేసేయదు. ఇటీవలే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ ని తాప్సీ తిరస్కరించింది. ఇక టాలీవుడ్ కెరీర్ పరిశీలిస్తే.. `ఆనందో బ్రహ్మ` తర్వాత ఈ భామ తెలుగు సినిమాకి సంతకం చేయలేదు. అయితే ఇక్కడా నటించే ఆసక్తి ఉందని చెబుతోంది. టాలీవుడ్ లో డెబ్యూ నాయికగా ఆరంగేట్రం చేసి ఇక్కడ అగ్రహీరోయిన్ కాలేకపోయానన్న ఒకే ఒక్క కలత తప్ప ఇంకే దిగులూ కెరీర్ పరంగా లేదు. అయితే ఈ భామకు మెగాక్యాంప్ నుంచి పిలుపు రాకపోవడమే టాలీవుడ్ కెరీర్ వెనకబాటుకు కారణమని క్రిటిక్స్ విశ్లేషించిన సంగతి తెలిసిందే.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa