కొత్త దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం "బింబిసార". ఇందులో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్, శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ కే నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, బింబిసార థియేట్రికల్ బిజినెస్ మాత్రం అంత గొప్ప స్థితిలో లేదు. దీనికి కళ్యాణ్ రామ్ గత చిత్రాల మార్కెట్ కారణం కావొచ్చు.
బింబిసార బిజినెస్ ఎలా ఉందంటే, నైజాం - 5కోట్లు, సీడెడ్ - 2 కోట్లు, ఆంధ్ర - ఆరున్నర కోట్లు.. మొత్తం కలిపి ఏపీ, తెలంగాణాలలో పదమూడున్నర కోట్ల బిజినెస్ ను జరుపుకుంది. అలానే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - 1. 1 కోట్లు, ఓవర్సీస్ - ఒక కోటి... ప్రపంచవ్యాప్తంగా 15.60కోట్ల బిజినెస్ ను జరుపుకుని, 16. 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆగస్టు 5న విడుదల కాబోతుంది.