రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బింబిసార నుండి కొంచెంసేపటి క్రితమే "విజయహొ" అనే వీడియో సాంగ్ విడుదలైంది. బింబిసారుడి ధీరత్వాన్ని, క్రూరత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన ఈ పాట గూజ్ బంప్స్ కలిగించే విధంగా ఉంది. ఈ పాటను ఎం ఎం కీరవాణి స్వరపరచగా, చైతన్య ప్రసాద్ సాహిత్యమందించారు. హేమచంద్ర, సాయిచరణ్, హారికా నారాయణ్ తదితరులు కలిసి ఆలపించారు.
కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్లో సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో క్యాథెరిన్, సంయుక్తా మీనన్, ప్రకాష్ రాజ్, శ్రీనివాస రెడ్డి, అయ్యప్ప శర్మ, హర్ష చెముడు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa