కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, అనూప్ భండారి డైరెక్షన్లో రూపొందిన మూవీ "విక్రాంత్ రోణ". ప్రపంచవ్యాప్తంగా జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఒక్క కన్నడలోనే కాక విడుదలైన ప్రతి చోటా ఈ సినిమా విజయభేరి మోగిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ కలెక్షన్లు అన్ని భాషల్లో కలిపి వంద కోట్లు దాటినట్టు తెలుస్తుంది. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, షాలిని ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిధి పాత్రలో మెరిసింది. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa