దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల "సీతారామం" రేపు ప్రేక్షకులను పలకరించబోతుండగా, కొంచెం సేపటి క్రితమే మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేసారు. 2021 ఏప్రిల్ 7న కాశ్మీర్ లో మైనస్ 17 డిగ్రీలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఎపిక్ లవ్ స్టోరీ యొక్క అద్భుతమైన విజువల్స్, స్వచ్ఛమైన తెలుగు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా, రేపు విడుదల కాబోయే సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
ఈ సినిమాకు హను రాఘవపూడి డైరెక్టర్ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ ఈ మూవీని నిర్మించింది.