రాజమౌళి డైరెక్షన్లో అద్భుతమైన విజువల్ వండర్ గా తెరెకెక్కిన ఆర్ ఆర్ ఆర్ లో రామ్, భీమ్ లుగా నటించి పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సినిమాలో రామ్ గా చెర్రీ ఫిట్నెస్, కండలు తిరిగిన దేహంతో ఆడియన్స్ ను ఫుల్ ఫిదా చేయగా, భీం కాస్తంత బొద్దుగా, పాత్రకు తగ్గ అమాయకత్వం, మొరటుతనం బాడీ లాంగ్వేజ్ లో కూడా చూపిస్తూ తన యాక్టింగ్ ట్యాలెంట్ తో దేశవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
RRR తదుపరి RC 15 సినిమా చేస్తున్న చెర్రీ అంతే ఫిట్ గా, చార్మింగ్ లుక్ లో కనిపిస్తుంటే, తారక్ మాత్రం ఔటాఫ్ షేప్ లో కనిపించి నందమూరి అభిమానులను నిరుత్సాహ పరిచాడనే చెప్పాలి. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చాన్నాళ్ల తరవాత పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చిన తారక్ ను చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉంటే , కొరటాల మూవీ కోసం కొత్త గెటప్, మేకోవర్ ను ట్రై చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ, తారక్ ను చూస్తే అలాంటిదేమీ లేదని అర్ధమైపోయింది.
RRR లో ఒకరికొకరు పూర్తి భిన్నంగా కనిపించిన చెర్రీ, తారక్ లు తరవాత కూడా ఇదే లుక్ ను మెయిన్ టైన్ చేస్తూ, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. కాకపోతే, చెర్రీ ఫిట్ లుక్ తో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతుండగా, తారక్ బొద్దావతారం నందమూరి అభిమానులను నిరాశపరుస్తుంది.