కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పలు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతల సమ్మె జరుగుతుండడంతో ఈ మూవీ షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడింది. ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావలసిన షూటింగ్ పూర్తవుతుందో లేదో అని ఒక పక్క అభిమానులు ఆందోళన చెందుంతుంటే, డైరెక్టర్ శంకర్ వీరి ఆందోళనను రెట్టింపు చేస్తున్నారు.
కమల్ హాసన్ - శంకర్ల ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ "ఇండియన్ 2" షూటిoగ్ సెప్టెంబర్ 13 నుండి మొదలు కాబోతుందని ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తన ఇన్స్టా లైవ్ లో చెప్పింది. శంకర్ ఒకేసారి రెండు బిగ్ ప్రాజెక్ట్ ల షూటింగ్ ను పూర్తి చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, ఆయన డబుల్ ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆ రెండు సినిమాల ఔట్ పుట్ లో ఖచ్చితంగా తేడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయo మెగా అభిమానులను ఆందోళన కలిగించటమే కాక, శంకర్ పై మండిపడేలా చేస్తుంది. సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర నెగిటివిటీని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే, ఆల్రెడీ RRR వంటి ఘనవిజయం తదుపరి ఆచార్య చేసి చెయ్యి కాల్చుకున్న చెర్రీ ఈ సినిమాపై పూర్తి అసలు పెట్టుకున్నాడు. రామ్ చరణ్ RRR రేంజ్ హిట్ కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తుంటే, శంకర్ సడెన్ షెడ్యూల్ చేంజెస్ వారి గుండెల్లో గుబులు రేపుతోంది. శంకర్ రెండు పడవల ప్రయాణం విజయవంతమవుతుందో లేదో చూడాలి మరి.