ఆగస్టు 5 అంటే ఈ రోజు ఒకేసారి రెండు బిగ్ సినిమాలు థియేటర్లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యాయి. దీంతో ఆ రెండు మూవీ టీమ్స్ సోషల్ మీడియాలో ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ట్వీట్లు చేసుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మొదటిసారి ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన సీతారామం సినిమాలు ఈ రోజు నుండే థియేటర్లలో సందడి చెయ్యడం స్టార్ట్ చేసాయి. దీంతో నిన్న రాత్రి ట్విట్టర్ లో సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి బింబిసార అండ్ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియచేస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ కు ట్వీట్ చేసారు. అందుకు కళ్యాణ్ రామ్ కూడా సీతారామం అండ్ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్తూ, త్వరలోనే సినిమా చూస్తానని, సినిమా తప్పక విజయం సాధిస్తుందని రీట్వీట్ చేసారు.