మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తొలిసారి తెలుగులో హీరోగా నటిస్తున్న చిత్రం "సీతారామం". బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. హను రాఘవపూడి డైరెక్షన్లో క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలైంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, భీమవరం జిల్లా వాసులు దుల్కర్ సల్మాన్ కు 35 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి, మల్లూవుడ్ దుల్కర్ ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసారు. భాషతో, ఇండస్ట్రీతో సంబంధం లేకుండా నటులు నచ్చితే, గుండెల్లో పెట్టుకుని ఆరాధించే తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.