టాలీవుడ్ టాప్ సైరన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా చూపిస్తుంది. ఐతే, ఆమె ఇప్పటివరకు అక్కడ ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. కానీ, పలు క్రేజీ ప్రాజెక్టుల్లో సమంత భాగం కాబోతుందని ప్రచారం జరుగుతుంది. సమంత బాలీవుడ్ ఎంట్రీపై ఇంకా సరైన క్లారిటీ రాకముందే, ఆమె మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదికూడా... మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వంటి రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోతో సమంత నటించబోతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
దుల్కర్ హీరోగా నటించబోయే కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో సమంత హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.