టాలీవుడ్ యువనటుడు విశ్వక్ సేన్ హీరోగా, విద్యాసాగర్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం "అశోకవనంలో అర్జునకళ్యాణం". రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 22న విడుదలై డీసెంట్ హిట్ కొట్టింది. ఇటీవల ఓటిటిలో కూడా విడుదలై అక్కడ కూడా మంచి స్ట్రీమింగ్ వ్యూస్ ను కొట్టేసింది.
లేటెస్ట్ గా అశోకవనంలో అర్జునకళ్యాణం మూవీ బుల్లితెరపై సందడి చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. జెమినీ టివిలో ఆగస్టు 7వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ మూవీ తొలిసారి బుల్లితెరపై టెలికాస్ట్ కాబోతుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. BVSN ప్రసాద్ సమర్పణలో SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాని నిర్మించారు.