పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న "లైగర్" పై అంచనాలు భారీ రేంజులో ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో కన్నా ఈ మూవీ పట్ల , విజయ్ పట్ల ఉత్తరాది ప్రేక్షకులు విశేషాసక్తిని చూపిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుందట. సినిమా నిడివి 140 నిమిషాలంట. అలానే ఈ సినిమాలో ఆరు మేజర్ స్టంట్ సీన్లు ప్రేక్షకులకు గూజ్ బంప్స్ కలిగించే విధంగా ఉన్నాయట. ఇక, క్లైమాక్స్ ఐతే, ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందట. ఈ సినిమా కోసం విజయ్ MMA (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించి సినిమాలో ఉండే ఒక డెడ్లీ యాక్షన్ సీన్ ఐతే సూపర్ ఉంటుందట.
అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ సినిమాను నిర్మించింది.