శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ అని జరుగుతున్న ప్రచారంపై తాజాగా ఆమె స్పందించింది. తారక్‌తో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని, అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేసింది. తెలుగులో నటించాలని ఉందని చెప్పింది. ఎన్టీఆర్ తో సినిమాపై జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది.