శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. పలు కారణాలతో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కాజల్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13 నుంచి ఇండియన్-2 షూటింగ్ ప్రారంభం కానుందని, తాను కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని తెలిపింది.
శంకర్ దర్శకత్వంలో ఉలగ నాయగన్ కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక 26 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రాన్ని ఇటీవలే ప్రకటించి కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేశాడు శంకర్. అయితే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు 2 కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.