యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది. మరోవైపున పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఈ నెల 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది…ఈ నేపథ్యంలో రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.. నోవాటెల్ వేదికగా జరిగే ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు..కాగా జగపతిబాబు, నాగబాబు లతో పాటుగా సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత పై భారీ అంచనాలున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa