బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్‌లో జరుగుతోంది. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా చిత్రీకరణలో భాగంగా కాజల్.. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియోను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కొండచిలువను పట్టుకున్నప్పుడు ఆమె తెగ కంగారుపడిపోయారు. కానీ ఆమె పక్కనే పర్యవేక్షకులు ఉండడంతో ధైర్యంగా పట్టుకోగలిగారు.
ఆ సమయంలో కాజల్ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి.. ‘కాజల్ నువ్వు పాము స్పర్శను గ్రహించగలుగుతున్నావా?’ అని అడిగారు. ఇందుకు కాజల్... ‘అవును. నాకు దాని కండరాల కదలిక తెలుస్తోంది. బుసలు కొడుతున్న విషయమూ తెలుస్తోంది’ అని చెప్పారు. ‘ఇదొక గొప్ప అనుభూతి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను దర్శకుడు తేజ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష 44వేల మంది వీక్షించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కాజల్-శ్రీనివాస్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. తేజ-కాజల్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘లక్ష్మీ కల్యాణం’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa