ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ అడ్వెంచరస్ విజువల్ వండర్ "RRR". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ల నటవిశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులే కాక, దేశ, విదేశాల ప్రజలు సైతం ఫుల్ ఫిదా ఐన చిత్రమిది.మార్చి 25న విడుదలైన ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడవ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. వెండితెరపై, ఆ తరవాత ఓటిటి, లేటెస్ట్ గా టెలివిజన్ ప్రీమియర్ కూడా కాబోతున్న ఈ సినిమాను చూడని ప్రేక్షకుడున్నాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
లేటెస్ట్ గా RRR సినిమాను తానింకా చూడలేదని చెప్పారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆమీర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. రాజమౌళితో పని చెయ్యాలని ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న ఆమీర్ రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేసిన RRR సినిమాను ఇంకా చూడకపోవడం నిజంగా విశేషమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa