పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ "లైగర్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని 'లైగర్ కోకా 2.0' అనే పాటను విడుదల చేసారు. ఈ సాంగ్ ని సుఖే మరియు లిసా మిశ్రా పాడారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సాంగ్ 6M వీక్షణలు మరియు 400k లైక్‌లతో యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది. ఈరోజు ఉదయం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విట్టర్‌లో కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని ప్రకటించింది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.