తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ ట్రెడిషనల్ హీరోయిన్ గా మరింత క్రేజ్ పెంచుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో వరుస ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. గ్లామర్ పరంగా, నటన పరంగా ఆడియెన్స్ నుంచి ఒకే అనిపించుకున్న ఈ హీరోయిన్.. స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన అభిమానులను సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఖుషీ చేస్తోంది. ఈ మేరకు ట్రెడిషనల్ లుక్ లో ఎప్పటికప్పుడు దర్శనమిస్తూ ఫిదా చేస్తోంది. ప్రియాంక అందాల విందుకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తను పోస్ట్ చేస్తున్న పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తూనే ఉంటారు.అయితే ప్రియాంక మోహన్ గ్లామర్ షోలో హద్దులు దాటడం ఇప్పటి వరకు జరగలేదు. ట్రెడిషనల్ గానే ఫొటోషూట్లు చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ నుంచి ట్రెడిషనల్ అందాలనే కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రియాంక ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట క్రేజ్ పెంచేస్తోంది.
![]() |
![]() |