కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే హాలీవుడ్ డెబ్యూ మూవీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసారు. తమిళంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "తిరుచిత్రంబలం". మిత్రన్ ఆర్. జవహర్ డైరెక్షన్లో డిఫరెంట్ లైఫ్ జర్నీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. నిత్యామీనన్ కీరోల్ లో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, ప్రకాష్ రాజ్, భారతీరాజా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ తెలుగులో "తిరు"గా విడుదల కాబోతుంది. ఈ మేరకు ఈ సినిమాను నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేసింది. తమిళంతో పాటు సైమల్టేనియస్ గా తెలుగులో ఆగస్టు 18వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.